హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై ఆగి ఉన్న కర్నూలు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారు పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రైల్వే అధికారులపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ట్రాక్‌పై రైలు నిలిచి ఉన్నప్పుడు మరో రైలుకు ఎలా సిగ్నల్ ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. రైల్వే పోలీసులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్యాబిన్‌లో చిక్కుకున్న లోకో పైలెట్
ఈ ఘటనలో రైల్ క్యాబిన్‌లో ఎంఎంటీఎస్ లోకో పైలెట్ చిక్కుకున్నాడు. రైలు ముందు భాగం నుజ్జునుజ్జు కావడం వల్ల లోకో పైలెట్‌ను బయటకు తీసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గంటకు పైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: