ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. రామకృష్ణారెడ్డి నివాసం సమీపంలోని ఫాంహౌస్తో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు రామకృష్ణారెడ్డి మృతదేహానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర అవుకులోని ప్రధాన వీధుల్లో సాగింది. ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీదేవి ఇతర అధికారులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
చల్లా రామకృష్ణారెడ్డి 1983లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి పాణ్యం నియోజవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1999, 2004లో కోయిలకుంట్ల ఎమ్మెల్యేగా పని చేశారు. గత తెదేపా ప్రభుత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్ గానూ పనిచేశారు.
ఇదీచదవండి.