ETV Bharat / state

మంత్రులుగా ఇరువురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

కర్నూలు జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్ లో బెర్త్ లు దక్కించుకున్న డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర గవర్నరన్ నరసింహన్... మంత్రులుగా ప్రమాణం చేయించారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న నేతలు
author img

By

Published : Jun 8, 2019, 1:59 PM IST

కొత్త ప్రభుత్వం...కొత్త జట్టు పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది. కర్నూలు జిల్లా నుంచి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు జిల్లా నుంచి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
సర్పంచి టూ మంత్రి..

మంత్రులుగా ఇరువురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
వైకాపాలో అగ్రనేతగా, వివాదరహితుడిగా పేరున్న డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఇంజినీరింగ్ లో డిగ్రీ పొందిన బుగ్గన...1996లో సర్పంచిగా ఎన్నికయ్యారు. పదేళ్లు సర్పించిగా పనిచేసిన ఆయన...2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఆ తర్వాత జగన్ కలిసి నడిచిన ఆయన...2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కీలకమైన పీఏసీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టి అందరి మన్ననలు పొందారు. 2019 ఎన్నికల్లోనూ తెదేపా అభ్యర్థి కేఈ ప్రతాప్ పై 35,516 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.సామాజిక బలం అండగా...

ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జిల్లా నుంచి రెండో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జయరాం వరసగా రెండోసారి ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాల్మీకి ఓటర్లు ఎక్కువగా ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతోపాటు బళ్లారి నేతల నుంచి బలమైన అండ ఉండటంతో అనూహ్యంగా మంత్రివర్గం జట్టులోకి జయరాం పేరు వచ్చింది. సామాజిక సమీకరణాలతో జగన్‌ జట్టులోకి అవకాశం దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన జయరాం... వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేశారు.

Intro:ATP:- కరవు జిల్లా అయిన అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న పుట్టపర్తిని సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేయాలని సత్యసాయి బలవికాస్ విద్యాసంస్థల చైర్మన్ రంగారెడ్డి కోరారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో సత్య సాయి బాలవికాస్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు.

Body:సత్య సాయి బాబా కరవు జిల్లాలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారన్నారు. ప్రస్తుతం సత్య సాయి బాబా లేనప్పటికీ పుట్టపర్తికి సత్యసాయి జిల్లాగా నామకరణం చేసి జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందిస్తామని చెప్పారు.

బైట్... రంగారెడ్డి, సత్య సాయి బాలవికాస్ విద్యాసంస్థల చైర్మన్, అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.