శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనం అనంతరం ఆలయ ముందు భాగంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలుసుకున్నారు. ఒకరికొకరు నమస్కరించుకొని..కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కాసేపు నవ్వుకున్నారు. మీరు మీరు గోదారోళ్లు.. మధ్యలో ఇక్కడ రాయలసీమ వాళ్లం ఉన్నాం..చూడండి. అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మాట కలిపారు.
మంత్రి వెళ్లాక.. సోము వీర్రాజు వైకాపా ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు.
ఇదీ చూడండి.
somu veerraju: ఎమ్మిగనూరు ఎమ్మెల్యేపై సీఎం వైఖరి ఏంటి?: సోము వీర్రాజు