శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రికి దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు శ్రీస్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు అందజేశారు. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని శ్రీశైల మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైకాపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...: టైరు పగిలి ఆర్టీసీ బస్సు బోల్తా... ప్రయాణికులు సురక్షితం