కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని మంత్రి గుమ్మనూరు జయరాం కోరారు. కర్నూలు జిల్లా ఆలూరులో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని ఆయన పిచికారి చేశారు. ఏప్రిల్ చివరి నాటికి లాక్డౌన్ కొనసాగించే అవకాశాలున్నట్టు చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఇంటి నుంచి బయటకు రావద్దని.. స్వీయ నియంత్రణ, పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: