కరోనా కట్టడిలో రాష్ట్రం బాగా పని చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లాలో కొవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ ప్లాంట్లు, వ్యాక్సిన్ కార్యక్రమంపై చర్చించామని మంత్రి తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుర్వేదం, హోమియో కంటే అల్లోపతికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ మాత్రమే మందు అని అన్నారు.
ఇదీ చూడండి.