రాయల్టీ తగ్గించి గ్రానైట్ క్వారీ యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని కర్నూలులో క్వారీ యజమానులు గనులు, భూగర్బ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామశివారెడ్డికి వినతిపత్రం అందజేశారు. పక్క రాష్ట్రాల కంటే ఇక్కడ రాయల్టీ రూపంలో చెల్లించాల్సిన సుంకం చాలా ఎక్కువగా ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. డొమెస్టిక్ వినియోగం కోసం ఉపయోగించే గ్రానైట్ రాయల్టీ రాజస్థాన్లో టన్నుకు రూ.240, కర్ణాటకలో రూ.200 నుంచి 300 మధ్య ఉండగా.. రాష్ట్రంలో మాత్రం రూ.1300 నుంచి 1600 వసూలు చేసేలా కొత్త జీఓ విడుదల చేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో క్వారీ యజమానులు, పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహించారు. కర్నూలు జిల్లాలో 200 క్వారీ పరిశ్రమలు ఉండగా ప్రస్తుతం 20 లోపే పనిచేస్తున్నాయని తెలిపారు. సుంకాన్ని తగ్గించి పక్క రాష్ట్రాలతో సమానంగా రాయల్టీ సుంకాన్ని మన రాష్ట్రంలో వసూలు చేసి.. ఆదుకోవాలని వారు కోరారు.
ఇదీ చదవండి: