ETV Bharat / state

ఎస్పీ బాలు యాదిలో మొక్కలతో స్మృతివనం - Sp balu latest News

అనంత లోకాలకు వెళ్లినా.. ఆయన అలాపించిన గీతాలు శ్రోతల మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఆ గాన గంధర్వుడి జ్ఞాపకాలను నెమరు వేసుకునే పక్రియలో భాగంగా ఓ స్మృతివనం ఏర్పాటు చేశారు. చెట్టుకో పాట పేరిట నామకరణం చేసి బాలుకు నివాలర్పిస్తున్నారు.

ఎస్పీ బాలు యాదిలో మొక్కలతో స్మృతివనం
ఎస్పీ బాలు యాదిలో మొక్కలతో స్మృతివనం
author img

By

Published : Nov 15, 2020, 6:06 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల నవ నిర్మాణ సమితి సభ్యులు దాతల సహకారంతో స్వర్గధామం పేరిట కర్నూలు జిల్లా నంద్యాలో హిందూ స్మశానవాటికలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలు జ్ఞాపకార్థం 400 చెట్లతో ఈ స్మృతివనం ఏర్పాటు చేశారు.

ఎస్పీ బాలు యాదిలో మొక్కలతో స్మృతివనం
ఎస్పీ బాలు యాదిలో మొక్కలతో స్మృతివనం

బాలు పాటలతో చెట్లు..

నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సబ్ కలెక్టర్ కల్పనకుమారి తదితరులు హాజరై చెట్లను నాటారు. చెట్ల వద్ద పేరొందిన పాట సూచికను ఏర్పాటు చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. బాలు పాడిన చిలుకా క్షేమమా, ఏ కులం నీదంటే గోకులం, ఇదే నా మొదటి ప్రేమలేఖ, సిరి మల్లె పువ్వల్లే నవ్వు ఇలా సందేశాత్మక పాటల పేర్లు రాసి చిత్రం పేరుతో చెట్టు వద్ద సూచిక ఉంచారు.

ఆయన లేని లోటు పూడ్చలేనిది..

బాలసుబ్రమణ్యం లేని లోటు ఎంతో బాధాకరమని ఆయన జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటు చేశామని నవ నిర్మాణ సమితి అధ్యక్షుడు తెలిపారు.

ఎస్పీ బాలు యాదిలో మొక్కలతో స్మృతివనం
ఎస్పీ బాలు యాదిలో మొక్కలతో స్మృతివనం

సమితికి ఎంపీ అభినందన..

ఎస్పీ బాలు జ్ఞాపకార్థం చెట్లు నాటడం గొప్ప కార్యక్రమంగా నంద్యాల సబ్ కలెక్టర్​ కల్పనకుమారి పేర్కొన్నారు. వనం ఏర్పాటు చేసి బాలుకు నివాళులర్పించిన నవ నిర్మాణ సమితి సభ్యులను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అభినందించారు.

ఎస్పీ బాలు యాదిలో మొక్కలతో స్మృతివనం
ఎస్పీ బాలు యాదిలో మొక్కలతో స్మృతివనం

ఇవీ చూడండి : హార్డ్ వేర్ షాపులో అగ్నిప్రమాదం..ఎగసిపడిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.