ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: కర్నూలులో 144 సెక్షన్

author img

By

Published : Mar 24, 2020, 10:29 AM IST

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఎస్పీ నరసింహారెడ్డి, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. నిత్యావసరాలు, మందుల దుకాణాలు తప్ప ఇతర షాపులేవీ తెరవకూడదని స్పష్టం చేశారు.

meeting with merchants at kurnool creating awareness on corona
కర్నూలులో వర్తకుల, వ్యాపారవేత్తలతో సమావేశమైన అధికారులు

కర్నూలు జిల్లా డోన్​ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో వర్తకులు, వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లతో కరోనా నివారణ గురించి డీఎస్పీ నరసింహారెడ్డి, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకులు, మెడికల్ షాప్​లకు సంబంధించిన దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. కరోనాను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించారు. నిబంధనలు, ఆంక్షల మేరకు ఈ నెల 31 వరకు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మొత్తం మూసివేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కర్నూలు లాక్​డౌన్​... ప్రజలకు పోలీసుల సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.