కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. మురుగునీటి కాలువలో నీరు పోకపోవడంతో పెద్ద మార్కెట్ లో నీరు నిలిచిపోయింది. మోకాళ్ళ లోతు నీరు చేరడంతో వ్యాపారం లేక ఇబ్బందీ పడుతున్నామని వ్యాపారస్తులు ఆవేదన చెందుతున్నారు. అంతేగాక పురపాలక అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఇదీచూడండి.కడపలో ఉప్పొంగుతున్న కందూనది