కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉన్న పుణ్యక్షేత్రం రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధి కోసం రూ. 2 వేల కోట్లతో బృహత్ ప్రణాళిక రూపొందించినట్లు పీఠాధిపతి సుభుదేంద్ర స్వామి తెలిపారు. రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి 27వరకు జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి పనులను వివరించారు. ఉత్సవాల సందర్భంగా నూతనంగా సభా ప్రాంగణం ప్రారంభించనున్నారు. రూ. 6 కోట్లతో చేపట్టిన మహా ముఖద్వారం విస్తరణ పనుల శంకుస్థాపన.. 14 కిలోలతో తయారు చేసిన బంగారు పాత్రలను సమర్పించనున్నారు. వీటితోపాటు మంత్రాలయాన్ని ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Mining: 'గ్రానైట్ పరిశ్రమను, క్వారీ కార్మికులను ఆదుకోండి'