ETV Bharat / state

పొలం తగాదా.. వ్యక్తి దారుణ హత్య - కర్నూలు జిల్లా వార్తలు

పొలం తగాదా ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. విందుకని తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జరిగింది.

Man murder in Kurnool district
వ్యక్తి దారుణ హత్య
author img

By

Published : Feb 7, 2021, 5:50 PM IST

వ్యక్తి దారుణ హత్య

పొలం తగాదా కారణంగా ఓ వ్యక్తి దారుణంగా హతమయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన ఉసేన్ బాషాతో... వడ్డె శివశంకర్​కు గ్రామంలో ఐదు ఎకరాల పొలం విషయంలో గొడవ ఉంది. ఈ విషయం కోర్టులో ఉంది.

ఈ క్రమంలో... శనివారం రాత్రి శివశంకర్​ను పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో విందు ఉందని ఓ వ్యక్తి తీసుకెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. హంతకుడు పోలీసుల వద్ద లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో కర్నూలు రూరల్ పోలీసులు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

విద్యార్థుల ముందే ప్రధానోపాధ్యాయుడిని కొట్టిన గ్రామస్తుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.