తనకు వచ్చిన కాంట్రాక్టును వేరే వారికి ఇప్పించి కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే అన్యాయం చేశాడని ఓ విద్యుత్ గుత్తేదారు తన కుటుంబ సభ్యులతో కలిసి తీసిన సెల్ఫీ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుత్తేదారు మునాఫ్ మరో మారు ఆవేదన వ్యక్తంచేశారు. తాను బతకడం ఇష్టం లేకపోతే ఊరు వదిలి వెళ్లిపోతానని.. ఆ తరువాత తన చావు చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆ అసంతృప్తి వెనుక కథేంటి..?