ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. రూ.28 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్థుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు నగరానికి చెందిన సయ్యద్ మక్బూల్ బాషకి.. షైన్ డాట్ కామ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు 2,500 చెల్లిస్తే.. ట్రైనింగ్‌కు కాలిఫోర్నియా పంపుతామని.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరేంద్ర కుమార్ శర్మ పదేపదే ఫోన్ చేసేవాడని బాధితుడు పోలీసులకు తెలిపారు.
విడతల వారీగా బాధితుడు రూ.28 లక్షలు.. శర్మకు పంపాడు. కొద్దిరోజుల తర్వాత మోసపోయానని తెలుసుకున్న మక్బూల్ బాష.. 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కకుండా.. ఉత్తరప్రదేశ్‌లో తలదాచుకోగా.. కర్నూలు మూడో పట్టణ పోలీసులు టెక్నాలజీ సహయంతో పట్టుకున్నారని డీఎస్పీ వెంకటరాయమ్య తెలిపారు. ఈ కేసులో రూ.4 లక్షలు రికవరీ చేశామని.. దర్యాఫ్తులో మిగిలిన డబ్బు రికవరీ చేస్తామన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెబితే.. నమ్మవద్దని డీఎస్పీ వెంకటరాయమ్య తెలిపారు.
ఇదీ చదవండి: