కర్నూలు జిల్లా మహానంది దేవస్థానంలో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ ఉప కమిషనర్ సుబ్బారావు తెలిపారు. దుకాణాల కేటాయింపులో జరిగిన అవకతవకలు, దాతలు ఇచ్చిన బంగారానికి రసీదు లేకపోవడంపై ఆయన విచారణ చేపట్టారు.
కోవిడ్-19 కారణంగా ప్రత్యేక చర్యలు
కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా మహానందిలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయం ఆవరణలో ఉన్న పెద్ద కొనేరును మూసివేశారు. మిగతా రెండు కొనేర్లలో స్నానాలకు బదులుగా కేవలం కాళ్లు, చేతులు శుభ్రం చేసుకొనేందుకు చర్యలు చేపట్టారు. భక్తులు గుంపులుగా కాకుండా విడివిడిగా దర్శనం చేసుకొనే ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సుబ్బారావు తెలిపారు.