ఉగాది సందర్భంగా కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో 108 బంగారు పుష్పాలను ఆవిష్కరించారు. దేవస్థానం సిబ్బంది, పండితులు, అధికారులు కలిసి 4 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి స్వర్ణ కమలాలను తయారు చేయించారు. శనివారం సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పసిడి పుష్పాలతో పాటు పంచాంగం పుస్తకాలకు వేదోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో కామేశ్వరీ దేవి అమ్మవారికి ఈ బంగారు పుష్పాలతో పూజ చేయనున్నట్లు ఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. టికెట్ ధర 504 రూపాయలుగా నిర్ణయించామన్నారు.
మహానంది పుణ్యక్షేత్రంలో 108 స్వర్ణ కమలాల ఆవిష్కరణ - మహానంది
మహానంది పుణ్యక్షేత్రంలో 108 బంగారు పుష్పాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆలయ అధికారులు, వేద పండితులు, దేవస్థానం సిబ్బంది కలిసి ఈ స్వర్ణ కమలాలను తయారు చేయించారు. కామేశ్వరీ దేవికి చేసే పూజలో ఈ పూలను వినియోగించనున్నారు.

TAGGED:
మహానంది