కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఉమామహేశ్వర స్వామికి పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. రాత్రి జాగరణ సందర్భంగా యాగంటి ఆలయానికి పెద్ద భక్తులు చేరుకున్నారు. ఆలయ ఆవరణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటకాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమామహేశ్వర సత్రం ద్వారా భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13న రథోత్సవం, 14న నాగవల్లి వసంతోత్సవం శివ దీక్ష విరమణ కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చూడండి: అబ్బో.. ఈ కంద ఎంత పెద్దదో