ETV Bharat / state

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో వైభవంగా మహా అభిషేకం - మూల రామ స్వామివారికి మహా అభిషేకం

కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో మూలరాముల స్వామివారికి మహా అభిషేకం కనులపండుగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

mula ramulaku maha abhisekham at mantralayam
మహా అభిషేకం కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు
author img

By

Published : Nov 5, 2021, 10:19 PM IST

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మఠంలో మూలరాముల స్వామివారికి మహా అభిషేకం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పీఠాధిపతి సుబుదేంద్ర స్వామి నిర్వహించారు. ఏట దీపావళి బలి పాడ్యమి సందర్భంగా మూల రాములకు మహా అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పూజ మందిరంలో సంస్థాన పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా బంగారు మండపంలో మూల రాములు, దిగ్విజయ రాములు, జయ రాములు, సంతాన గోపాలకృష్ణ, వైకుంఠ వాసు దేవత విగ్రహ మూర్తులను కొలువుదీర్చారు. పండితుల వేద మంత్రాల మధ్య మూల రామ దేవుడికి మహా అభిషేకం నిర్వహించారు.

అనంతరం ప్రత్యేక మంగళ హారతి ఇచ్చారు. వజ్ర, బంగారు ఆభరణాలతో స్వామి వారిని అలంకరించారు. పూలతో అభిషేకం చేశారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

రామోజీ ఫిల్మ్ సిటీలో కేక్ మిక్సింగ్... 30 కిలోలు... 8 రకాల డ్రైఫ్రూట్స్‌తో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.