కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఈర్ల దిన్నె గ్రామంలో 240 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అబ్కారీ శాఖ పోలీసులు తెలిపారు. తెలంగాణలోని రాజోలి పరిధిలోని తుమిళ్ల ప్రాంతం నుంచి ఈ మద్యాన్ని రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
మద్యం తీసుకెళ్తున్న బోయ నారాయణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో... అబ్కారీ శాఖ ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: