కరోనా నేపథ్యంలో కర్నూలు జిల్లా బేతంచెర్లలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పారిశుద్ద కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం నిరంతరం శ్రమిస్తోన్న సిబ్బందికి ఎస్సై సురేష్ చేతులమీదుగా బియ్యం, చక్కెర, గోధుమపిండి, ఉప్పు, కారం వంటి 10 రకాల వస్తువులు అందజేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ
జిల్లాలోని బేతంచర్లలో ఒక కరోనా కేసు నమోదు కావడం వల్ల ఈ ప్రాంతాన్ని అధికారులు ఆరెంజ్ జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన దాదాపు 100 కుటుంబాలకు.. లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యావసరాలు అందజేశారు.
ఇదీ చూడండి