కర్నూలు జిల్లా సున్నిపెంటలోని చిరుత పులి మృతదేహం కనిపించింది. ఈద్గా సమీపంలో చిరుతపులి మృత కళేబరాన్ని గుర్తించిన అటవీశాఖ సిబ్బంది.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మకూరు డీఎఫ్‌వో డి.ఎ.కిరణ్, సబ్ డీఎఫ్‌వో విఘ్నేష్ అప్పావు, తహసీల్దారు రాజేంద్రసింగ్, పశువైద్యాధికారి ఎల్.వి.నారాయణరెడ్డి, అటవీ రేంజ్ అధికారి నరసింహులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కొండారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన చిరుత వయస్సు సుమారు ఒకటిన్నర సంవత్సరం ఉండొచ్చని, ఘటన జరిగి పది రోజులవుతుందని తెలిపారు. చిరుతపులి మృత కళేబరానికి పంచనామా నిర్వహించి దహనం చేశారు.
ఇదీ చదవండి: