ETV Bharat / state

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ధర్నా - cpi agitation

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేశాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు మండిపడ్డారు.

Left-wing  protest
వామపక్షాలు ధర్నా
author img

By

Published : Sep 14, 2020, 6:36 PM IST

విశాఖ జిల్లాలో..
దేశంలోని ప్రజల సంపదను కార్పొరేట్ కంపెనీలకు మోదీ ప్రభుత్వం దోచిపెడుతోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం... హామీలను నిలబెట్టుకోకపోగా, ఆర్థిక రంగాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పెంచారని, దేశంలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్​గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. దేశ ఆర్థిక పురోభివృద్ధికి ఎంతో దోహదం చేసిన ప్రభుత్వ రంగాన్నిభాజాపా ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఎం. పైడ్రాజు జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ. విమల చంద్రశేఖర్, లక్ష్మణరావు దేవుడు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జయతి ఘోష్, అపూర్వానంద్ వంటి మేధావులపై పెట్టిన తప్పడు ఛార్జ్​షీట్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లౌకిక విలువలకు కట్టుబడి ప్రజాసామ్యాన్ని కాపాడాలని పోరాడే వారిపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదని అన్నారు. వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

భవన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జీవో నెంబర్17 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవన కార్మికుల సంక్షేమ నిధిలో ఉన్న రూ. 450 కోట్లను ప్రభుత్వ ఖాతాలోకి మళ్లించారన్నారు. ఇసుక అందుబాటులేక కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రభుత్వం కార్మికులకు నెలకు పదివేల రుపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప కూడలిలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పెరిగిందని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పంపన్న గౌడ్ అన్నారు. కేంద్రం బడా కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల రాయితీ ఇచ్చి పేదలు, రైతులను విస్మరించిందని ఆరోపించారు.

గుంటూరు జిల్లాలో..
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ గుంటూరులో సీపీఐ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరు పార్కు సెంటర్ వద్ద వున్నసచివాలయం ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. నిరుద్యోగం, పేదరికం నానాటికి పెరిగి పోయిందని.. ఎంతోమంది జీవన ఉపాధి కోల్పోయి దయనీయస్థితి అనుభవిస్తున్నారన్నారు. భాజాపా ప్రభుత్వం వలన ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం దాపురించిందన్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక వ్యవస్థ గురించి తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలకు లేనిపోని ఆశలు కల్పిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్బర్ ప్యాకేజీ వల్ల పేద, సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

కృష్ణా జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. విజయవాడ దాసరి భవన్ వద్ద సీపీఐ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. దేశంలో మైనస్ 23.9 శాతం జీడీపీ పడిపోయిందని....ఇలాంటి సమయంలో కూడా అంబానీ, ఆదాని ఆస్తులను పెంచుకునే మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర సహాయ కార్యదర్శి అక్కినేని వనజ మండిపడ్డారు. లాభాలు వచ్చే ప్రభుత్వ రంగాలను ప్రైవేటు రంగాలలో అప్పగిస్తున్నారని... రైతులకు నష్టం చేకూర్చే ఆర్డినెన్సును తేవాలని ... పార్లమెంట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో... శ్రీకాకుళం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట పలు రైతుకూలీ కార్మిక సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పొలాలకు నీరు లేక పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న గణాంకాలలో 43 శాతం వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. అందుకే జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని.. జగన్ సర్కార్ కేంద్రానికి నివేదిక పంపాలన్నారు. లాక్​డౌన్ విధించిన నాటినుంచి ఇప్పటిదాకా ఉపాధి, వలస కూలీలు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించి వారిని ఆదుకోవాలని తెలియజేశారు.

అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో సీపీఐ, తెదేపా నాయకులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దగా చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని సీపీఐ మండల కార్యదర్శి చిన్నప్ప యాదవ్ అన్నారు. ప్రభుత్వాలు కేంద్ర సంస్కరణల పేరుతో వ్యవసాయ బోరు బావులకు మీటర్లు పేరుతో జారీ చేసిన 22 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర రాక అల్లాడుతున్న సమయంలో రైతుల బోరు బావులకు మీటర్ల సమకూర్చి మరింత భారాన్ని పెంచేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఏపీకి రావలసిన విభజన హమీలు అమలుపరచడంలో పూర్తిగా విఫలమయిందని తెలిపారు.

ఇదీ చూడండి. రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా కేసులు, 60 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.