కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలోని కొవిడ్ వార్డులో పడకలను 60 నుంచి 200 వరకు పెంచాలని వామపక్ష పార్టీలు, మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. కొవిడ్ రోగులకు ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉంచాలని.. నిపుణులైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు. కరోనా రోగులు మృతి చెందుతున్న క్రమంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.
ఇవీ చదవండి: