కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా కోర్టు నుంచి శ్రీకృష్ణదేవరాయలు కూడలి వరకు న్యాయవాదులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. వీరికి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంఘీభావం తెలిపారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సీఎం జగన్ అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :