ETV Bharat / state

బాధ్యత మరచిన కన్నవారు.. అనాథలైన చిన్నారులు - మల్లీశ్వరిబాయి

గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఎంతోమంది చిన్నారులను ఉన్నతులుగా తీర్చిదిద్దే ఓ ఉపాధ్యాయుడు... కన్నబిడ్డల కన్నీటికి కారణమయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చిత్రహింసలుపెట్టి... ఆఖరికి ఆత్యహత్య చేసుకునేలా చేశాడు. మద్యానికి బానిసై... పచ్చని సంసారాన్ని నాశనం చేశాడు. ఎంతోకాలం భరించిన ఆమె... ఆత్మహత్య చేసుకోవడంతో... పాపం ఈ బిడ్డలు అనాథలయ్యారు.

బాధ్యత మరచిన కన్నవారు.. అనాథలైన చిన్నారులు
author img

By

Published : May 12, 2019, 11:03 AM IST

బాధ్యత మరచిన కన్నవారు.. అనాథలైన చిన్నారులు

మొన్నటి వరకు తల్లి కొంగుచాటున పెరుగుతూ ఆడుతూ పాడుతూ హాయిగా జీవించేవారు ఈ ముగ్గురు అక్కా చెల్లెల్లు. ఓ సంఘటన కష్టమంటే ఏంటో తెలియని ఆ పసివారి జీవితాన్ని చీకటిమయం చేసింది. తల్లిని కోల్పోయి... తండ్రికి దూరమై అనాథలయ్యారు.

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్లకు చెందిన మల్లీశ్వరిబాయి... వెల్దుర్తి మండలం బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు. కల్లూరు మండలం బొల్లవరానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు సుధాకర్ ఈమెను ప్రేమించి రెండో భార్యగా చేసుకున్నాడు. వీరికి జోత్స్న, జీవనసుధ, చైత్ర ముగ్గురు సంతానం. మద్యానికి బానిసైన సుధాకర్ ప్రవర్తన గతి తప్పింది. భార్య, బిడ్డలను వేధించాడు. తట్టుకోలేని మల్లీశ్వరిబాయి పోలీసులను ఆశ్రయించింది. పోలీసు కౌన్సిలింగ్‌తోనూ సుధాకర్​లో మార్పు రాలేదు. విసుగు చెందిన మల్లీశ్వరిబాయి... ఆత్మహత్య చేసుకుంది.

భార్య బలవన్మరణానికి కారణమయ్యాడని సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమగా చూసుకునే తల్లి దూరమైంది. బాధ్యతగా చూసుకుంటాడనుకున్న తండ్రి జైలుకెళ్లాడు. ఫలితంగా చిన్నారులు దిక్కులేనివారయ్యారు. వీరి పరిస్థితి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ చిన్నారులను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. వారిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

తల్లి జ్ఞాపకాలు వెంటాడుతున్నా... తండ్రి వస్తాడో రాడో అన్న సందేహంతో శిశుసంరక్షణ కేంద్రంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారీ పసివారు.

ఇదీ చదవండి...

మూగజీవాల పట్ల 'భగీరథుడు'

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు స్థానిక రెడ్డి కళ్యాణ మండపం లో శుక్రవారం రాత్రి అశ్లీల నృత్యాలు జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. poduru మండలం కవితంకు చెందిన చైతన్య అనే యువకుడు శుక్రవారం రాత్రి కళ్యాణ మండపంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి నలుగురు మహిళలు ,ఆర్కెస్ట్రా సభ్యులను తీసుకొచ్చి పాటల కచేరి చేయించారు. ఈ పార్టీలో సుమారు 100మంది యువకులు వివిధ పార్టీ లకు చెందిననాయకులు పాల్గొన్నట్లు సమాచారం. అర్ధరాత్రి అనంతరం పోలీసులు దాడి చేసి నలుగురు మహిళలు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు .పుట్టినరోజు వేడుక సందర్భంగా రేవ్ పార్టీ జరుగుతుందని ప్రచారం జరగడంతో మండలంలో కలకలం రేగింది. దీనిపై పెనుగొండ సిఐ రాయుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఆర్కెస్ట్రా ఏర్పాటుచేసి యువతులతో నృత్యాలు చేస్తుండగా దాడి చేశామని కేసు నమోదు చేశామని తెలిపారు .రేవ్ పార్టీ అంటూ జరుగుతున్న ప్రసారాన్ని ఆయన ఖండించారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

Body:అరుణ్

Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.