ఈ నెల 16 వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాలలో దంత వైద్యురాలు మాధవిలత(48) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సంఘటన జరిగిన రోజున అందులో వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అయితే సూసైడ్ నోట్ లో ఏముందన్న విషయం కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు తెలిసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో దంత వైద్యురాలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ తెలిపారు.
ఆ సూసైడ్ నోట్ లో ఏముందంటే..
కిట్టు, పండు (భర్త, కుమారుడు).. నన్ను క్షమించండి. నేను మిస్టేక్ చేశాను. కుటుంబ పరువు పోకూడదని నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. మీతో బాధ్యతగా ఉండాల్సిన నేను వెళ్లి పోతున్నాను. కిట్టు.. పండు చాలా మంచోడు. బాగా చూసుకో. ఎవరైనా ఆడిగితే ఆరోగ్యం సరిగా లేక ఆత్మహత్య చేసుకుందని చెప్పండి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. -మాధవీలత
ఇదీ చదవండి: అభ్యంతరాలున్నా హెటిరోకు భూములు!