కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులు సమీర్ భాష, మధుసూదన్‌లు అంతర్జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపికయ్యారు. లైఫై సాంకేతికత సహాయంతో ఎలాంటి అనుసంధానం లేకుండా ధ్వని మార్పిడి ప్రయోగాన్ని విజయవంతంగా చేశారు. ధ్వని తరంగాలను కాంతిగా మార్చి.... అవి సోలార్ ప్యానల్‌పై పడేలా చేసి డేటాను పంపుతుంది. ఆ డేటాను... స్పీకర్ ధ్వని తరంగాలుగా మారుస్తుంది. ఈ లైఫై ద్వారా సమాచారాన్ని హ్యాక్ చేసే సౌలభ్యం ఉండదు. పర్యావరణ హితంగా సమాచారాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సాంకేతికతను ఆళ్లగడ్డ విద్యార్థులు అభివృద్ధి చేసి మొదట జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించి... న్యాయనిర్ణేతల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో వీళ్ల ప్రదర్శనకు రెండో స్థానం దక్కింది. త్వరలోనే విదేశాల్లో జరిగే సైన్స్‌ఫేర్‌కు ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను ఆళ్లగడ్డ ఎంఈఓ శోభా వివేకావతి అభినందించారు. భవిష్యత్తులో జరిగే ప్రదర్శనలో ప్రతిభ కనబరిచి... రాష్ట్రానికి, కర్నూలు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
ఇదీ చదవండి :