కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. కార్యాలయంలో పని చేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో... మూడు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు కమిషనర్ డీకే. బాలాజీ ప్రకటించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వినతి పత్రాల కోసం ప్రత్యేకం ఓ బాక్సును ఏర్పాటు చేశామనీ.. ఆ బాక్సులోనే వినతి పత్రాలు వేయాలని కోరారు. కర్నూలు నగర పాలక సంస్థ కరోనా కారణంగా మూతపడటం ఇది మూడోసారి.
ఇదీ చదవండి: కృష్ణాప్రవాహం పెరగటంతో జూరాల నుంచి నీటి విడుదల