కర్నూలు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నందున చికిత్స నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేశామని.. సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలో 160 పడకలు సిద్ధం చేశామని అవసరాన్నిబట్టి వాటిని విస్తరిస్తామని అన్నారు.
కొవిడ్ రోగులకు అవసరమైన అక్సిజన్, పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు, మందులు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. వాక్సిన్ కోసం వచ్చే ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా టీకా వేయించుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: