కర్నూలు జిల్లా నంద్యాల వరద ప్రభావ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ ఫకీరప్పా, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. నంద్యాల సమీపంలో అభాండం తండా వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోవటంతో.. వరికోత యంత్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. జలమయమైన కాలనీల్లో పర్యటించి.. పరిస్థితిని పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ డిపోలో వర్షపు నీరు... విలువైన వస్తువులు బయట...