ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు... సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 2017లో పదో తరగతి విద్యార్థినిగా ఉన్న ప్రీతి.. పాఠశాల వసతి గృహంలో ఆత్మహత్య చేసుంది. ఈ ఘటనతో తమకు న్యాయం చేయాలని ప్రీతి తల్లిదండ్రులు నేటికీ ఆందోళనలు చేస్తున్నారు. వీరి ఆవేదనపై ప్రభుత్వం స్పందించింది. ఆమె తల్లిదండ్రులు పార్వతీదేవి, రాజు నాయక్ లను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు.
ప్రీతి కుటుంబసభ్యులకు ఐదెకరాల భూమి, ఐదు సెంట్ల స్థలం, ప్రీతి తండ్రి రాజునాయక్కు ఉద్యోగం ఇస్తామని కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. ప్రీతి తల్లి పార్వతీదేవికి వైద్యం అందించాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని పార్వతి దేవికి రావలసిన 11 నెలల జీత భత్యాలు విడుదల చేయించారు.
ఇదీ చదవండి:
'సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏమైంది..?'
'సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోలీసు శాఖ తోడుగా ఉంటుంది'