కర్నూలు జిల్లా ఆదోనిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బోసిపోయింది. అధికారులు ఎవరు హాజరు కాలేదు, డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు మూసేశారు. నిన్న రైటర్ తీరు పై ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్యుమెంట్ రైటర్లు విచ్చలవిడిగా డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని, వారి తీరు పై హెచ్చరించారు. కార్యాలయంలో ఏ పని చేసిన రైటర్లు, సిబ్బంది డబ్బులు అడుగుతారని.. తన దృష్టికు వచ్చిందన్నారు. కావాలనే కుమ్మకై రెడ్ మార్కు పెట్టి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే రైటర్లు అందరిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనితో ఈ రోజు అధికార సిబ్బంది, రైటర్లతో సమావేశం జరిగింది. మరో సారి ఇలా జరిగితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది, రైటర్ల పై తీవ్ర పరిమాణాలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. Devineni uma arrest: ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు తలెత్తేలా వ్యవహరించారు: డీఎస్పీ శ్రీనివాసులు