కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం కొత్తగా జిల్లాలో 190 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 54 వేల 219 మందికి కరోనా సోకగా.. 50,904 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 2 వేల 8 వందల 68 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనాతో 447 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: శ్రీశైలం దేవస్థానంలో దురుసుగా ప్రవర్తించిన అధికారి బదిలీ