ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మినీ ట్రక్కుల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ చేయనున్నట్లు కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. రేపు విజయవాడలో సీఎం ప్రారంభించిన అనంతరం కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆ వాహనాలను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో 2436 రేషన్ దుకాణాలు ఉన్నాయని, 760 మినీ ట్రక్కుల ద్వారా... 11 లక్షలా 22 వేలా 566 మంది లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: కలెక్టర్ కార్యాలయానికి నామినేషన్ పత్రాల తరలింపు