కర్నూలు ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ విధులకు గైర్హాజరైన ఇద్దరు సీనియర్ వైద్యులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనస్థిషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ కుమార్, పీజీ డాక్టర్ సురేశ్ బాబులు విధులకు హజరుకానట్లు డ్యూటీ రిజిస్టర్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ తక్షణమే సస్పెండ్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ విధులకు హాజరుకాకుంటే ఉపేక్షించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఇదీచదవండి