ETV Bharat / state

కల్లలైన సొంతింటి కల.. లబ్ధిదారుల ఆశ నెరవేరలా..! - kurnool beneficiaries wants housing from government

తక్కువ ధరకే ఇల్లన్నారు. విలాసవంతంగా ఉంటుందని ఆశ చూపారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో జనం సొంతింటి కోసం క్యూ కట్టారు. డీడీల రూపంలో డబ్బు చెల్లించారు. తరువాతే అసలు కథ మొదలైంది. ఇల్లు పూర్తి కాక.. డబ్బులు చేతికి రాక బోరుమంటోన్న లబ్ధిదారుల పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

kurnool beneficiaries wants housing from government
ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు
author img

By

Published : Dec 11, 2019, 6:33 AM IST

ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు

పట్టణ పేదలకు మంజూరు చేసిన గృహాలపై ప్రభుత్వం చేస్తున్న సమీక్షతో లబ్ధిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ నిర్మాణాలు పూర్తైన వాటిని ఆపేయడంపై అసంతృప్తితో ఉన్నారు. తాము చెల్లించిన సొమ్మైనా వెనక్కి ఇవ్వాలని వేడుకుంటున్నారు. లేదా గృహ నిర్మాణాలైనా పూర్తి చేయాలని అభ్యర్థిస్తున్నారు.

టిడ్కో పేరిట డీడీలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పట్టణ పేదల కోసం 2,482 గృహాలను గత ప్రభుత్వం మంజూరు చేసింది. జీప్లస్ త్రీ విధానంలో అపార్ట్​మెంట్​ రూపంలో నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఆళ్లగడ్డలో 26 ఎకరాలు సేకరించి నిర్మాణాలు సైతం ప్రారంభించింది. పనుల వేగం చూసి దాదాపు 1482 మంది గృహాల కోసం టిడ్కో సంస్థ పేరిట కొందరు డీడీలు చెల్లించారు. మార్చి నెలలో ఎన్నికలు నోటిఫికేషన్‌ రాకతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

ఆగిపోయిన నిర్మాణాలు

అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... గత ప్రభుత్వ ప్రాజెక్టులను పునఃసమీక్షించింది. 25 శాతం కంటే తక్కువ నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటిని ఆపివేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఆళ్లగడ్డలో గృహ నిర్మాణాలు నిలిచిపోయాయి. డీడీలు కట్టి, అద్దె ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతున్నామంటున్నారు లబ్ధిదారులు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతున్నారు. లేకుంటే తమ డబ్బులైనా తిరిగి ఇవ్వాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

కష్టాల చెరలో ఉన్న ఆ ఇమామ్​బీకి అందెను బాసట..!

Intro:ap_knl_102_18_housing_pkg_ap10054 ఆళ్లగడ్డ 8008574916. పేదోడి సొంత ఇంటి కల సహకారం అయితే అతడు పొందే ఆనందం అంతా ఇంతా కాదు ఆ ఆనందాన్ని ప్రజలతో ఇచ్చేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు లోపభూయిష్ట విధానాల కారణంగా విఫలమవుతున్నాయి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పట్టణ పేదల కోసం 2482 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది వీటిని జి ప్లస్ త్రీ విధానంలో అపార్ట్మెంట్లో రూపంలో నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో భాగంగా గత టిడిపి ప్రభుత్వం ఆళ్లగడ్డలో 26 ఎకరాలను సేకరించింది ఇందులో నిర్మాణాల కోసం భూమిపూజ కూడా చేపట్టారు ప్రజలు గృహాల కోసం 500 మరికొందరు 12,500 డబల్ బెడ్ రూమ్ కావాలనుకున్నవారు 25000 బీడీల రూపంలో చెల్లించారు దాదాపు 700 మంది లబ్ధిదారులు డిటి లను tidco సంస్థ పేరిట చెల్లించారు ప్రభుత్వం గృహ నిర్మాణాలు ప్రారంభించారు మార్చి నెలల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో నిర్మాణాలు ఆగిపోయాయి అప్పటికి 20 శాతం కంటే తక్కువగా పనులు పూర్తయ్యాయి ఈలోగా ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం ఓడిపోవడం ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వ అ ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా 25 శాతం కంటే తక్కువ నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటిని ఆపివేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆళ్లగడ్డలో గృహ నిర్మాణాలు 20 శాతం లోపే పూర్తి కావడంతో వీటిని కూడా ప్రభుత్వం ఆపివేసింది గత ఏడు నెలలుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి డీడీలు కట్టిన లబ్ధిదారులు మాత్రం తమ గృహాలు ఎప్పుడు పూర్తయితే ఎప్పుడు వాటిలో ప్రవేశించాలని ఎదురుచూస్తున్నారు వారి ఆశ ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు ఓవైపు డీడీలు కట్టిన మరోవైపు అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి నిర్మాణాలను పూర్తి చేయాలని లేనిపక్షంలో ఇచ్చి వేయాలని ప్రజలు కోరుతున్నారు

Body:ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఇబ్బందుల్లో ప్రజలు

Conclusion:ఆగిపోయే గృహ నిర్మాణాలు ఇబ్బందుల్లో ప్రజలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.