టమాటా నారు నాటుతున్న కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి ఆదివారం వజ్రం లభించింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6 లక్షలకు దాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం.
స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వజ్రాన్వేషకులతో జొన్నగిరి పొలాలు కిటకిటలాడుతున్నాయి.
గత నెలలో ఇదే గ్రామంలో ఓ రైతు పొలానికి వెళ్లగా.. మిలమిలా మెరుస్తున్న రాయి ఆకర్షించింది. వజ్రంగా భావించి ఇంటికి తీసుకువచ్చాడు. స్థానిక వ్యాపారికి చూపించగా రూ.1.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిసింది. 30 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం(Diamond) మార్కెట్ ధర రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత ఇతర వ్యాపారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Lucky farmer: ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యాడు!