ETV Bharat / state

శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి ఆపాలని.. తెలంగాణకు లేఖ - srisailam power supply taja news

శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణకు సూచించింది. బోర్డు తరఫున సభ్యుడు హరికేశ్‌మీనా ఈ మేరకు లేఖ రాశారు.

krishna river board wrote letter to telangana water board about stop power supply in srisailam

author img

By

Published : Aug 4, 2020, 9:40 AM IST

శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ బోర్డుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. జులై 30వ తేదీ వరకు శ్రీశైలంలోకి 54.98 టీఎంసీలు వచ్చాయని, అందులో 32.27 టీఎంసీలను విద్యుత్తు ఉత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఇటీవల బోర్డుకు లేఖ రాసింది.

దీనివల్ల ఏపీలో రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఉత్పత్తిని, నీటి విడుదలను నిలిపివేసేలా అధికారులకు సూచించాలని బోర్డు తెలంగాణ జలవనరుల శాఖకు లేఖ రాసింది.

ఇదీ చూడండి

రాష్ట్రంలో కరోనా విజృంభణ... మరో 7822 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.