కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కృష్ణా బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, నీటి పారుదల శాఖ అధికారులు పర్యటించారు. పాములపాడు మండలంలో ఉన్న బనకచర్ల, పోతిరెడ్డిపాడును సందర్శించారు. బనకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ, కేసీ కాలువ, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ కాలువలను పరిశీలించి నీటి సామర్థ్యం, విడుదల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు వచ్చిన ఛైర్మన్‌కి హెడ్ రెగ్యులేటర్ గురించి.. నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: సీఎం జగన్‌ను కలిసిన భాజపా నేత టీజీ వెంకటేష్