కర్నూలు జిల్లా గూడూరు నగరపంచాయతీ ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. స్థానిక సీఐ శ్రీధర్ గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకా వేయించుకున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి పోలీస్ టీకాలు వేయించుకోవాలని స్పష్టం చేశారు.
స్వచ్ఛత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు..
గూడూరు నగరపంచాయతీలోని హోటళ్లు, మెడికల్ దుకాణాలను నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. సిరంజీలను ఎక్కడపడితే అక్కడ పడేవేయవద్దని సూచించారు.
ఇదీ చదవండి: 'నేలతలమర్రి పంచాయతీ... మళ్లీ రీ కౌంటింగ్ చేయండి'