ETV Bharat / state

'రెండో దశలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం' - కర్నూలులో కరోనా కేసులు న్యూస్

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని... కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. రెండో దశలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గతంతో పోల్చితే... మౌలిక వసతులు బాగా మెరుగుపరుచుకున్నామని గుర్తు చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది సైతం కరోనా బారినపడి కోలుకున్నారని చెబుతున్న డాక్టర్ చంద్రశేఖర్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి...

'రెండో దశలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉంది'

author img

By

Published : Sep 17, 2020, 5:57 AM IST

ప్రశ్న: కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది కారణమేంటి?

జవాబు: ఈ మధ్యకాలంలో గణనీయంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కర్నూలు వైద్య కళాశాలలో మూడు ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రతి రోజు 3 వేల నుంచి 5 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. మన జిల్లాలో పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టాయి. ఎందుకంటే మనకు ముందునుంచే ఎక్కువగా కేసులు రావటం జరిగింది. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే తగ్గు ముఖం పట్టింది. ఇది వన్‌ ఆఫ్ ది గుడ్ సైన్. నవంబర్ - డిసెంబర్ నెలల్లో సెకండ్ పీక్ వచ్చే అవకాశముంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్ రేటు తగ్గడంతో ఆసుపత్రుల్లో చేరికలు కూడా 20- 30 శాతం తగ్గాయి. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్న : గతంలో ఎన్ని పరీక్షలు చేసేవారు. ఇప్పుడెన్ని చేస్తున్నారు?

జవాబు : కర్నూలు వైద్య కళాశాలలో జీరో వైరల్ ల్యాబ్ ఉండేది. ఏప్రిల్ నుంచి ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాం. మనకు ప్రభుత్వ ల్యాబ్‌ కాకుండా ఇంకా రెండు ప్రయివేటు ల్యాబ్‌లు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రభుత్వ ల్యాబ్‌లో రోజుకు 12 వందల నుంచి 15 వందల వరకు పరీక్షలు చేస్తున్నాం. జీనోమిక్స్ వారు దాదాపు 15 వందలు, రెమిడి వారు 500 వందల పరీక్షలు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల్లో వైరల్ ల్యాబ్‌లు పెరిగాయి. థర్డ్‌ లెవల్ బయో సేఫ్టి ల్యాబ్‌లు అవసరం. 1.5 కోట్లతో ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ల్యాబ్‌లు ఉంటే రీసెర్చ్‌లకు, ప్యాండమిక్స్ వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంథ్రనాధ్‌రెడ్డిని అడగడం జరిగింది. 200-300 బెడ్స్‌తో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఉంటే ఎపిడమిక్, ప్యాండమిక్స్‌ వస్తే ప్రత్యేక బ్లాక్‌లో ఉంటే ఇబ్బంది ఉండదు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఐదారు జిల్లాలకు వరప్రదాయిని దీంతో నాన్ కొవిడ్ రోగులు ఇబ్బందులు పడటం జరుగుతుంది.

ప్రశ్న: ఈ మధ్యకాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువగా కరోనాబారిన పడుతున్నారు కదా?

జవాబు: వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు, పారామెడికల్, శానిటైజేషన్ సిబ్బంది, పోలీసులు ఎఫెక్ట్ అయ్యారు. వారి ఆరోగ్యం కోసం ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. కొంత మంది ప్రొఫెసర్స్‌ కూడా ఎఫెక్ట్ అయి కోలుకున్నారు. స్క్రీనింగ్ చేసినప్పుడు 22 మంది వైద్యులు పాజిటివ్‌గా తేలడం జరిగింది. కొంత మంది శానిటైజేషన్ సిబ్బందికి కూడా పాజిటివ్ వస్తే వారికి వైద్యం చేయడం జరిగింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాలలో ఒక స్టాఫ్‌ నర్సు మాత్రమే కరోనాతో చనిపోవడం జరిగింది. యువ వైద్యులు, పీజీలు ఎఫెక్ట్ అయినా త్వరగా కోలుకుని సేవలందిస్తున్నారు. కనిపించని శుత్రువుతో పోరాడుతున్నాం. జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు పోతున్నాం. వైద్యులు, ప్రొఫెసర్స్‌, అసోసియేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జూనియర్ వైద్యులు, హౌస్ సర్జన్స్‌, పీజీలు, ప్రైవేటు ఆసుపత్రులు అందరి కృషితో పేషంట్ కేర్ పెరిగింది.

ప్రశ్న : రోజూ మోర్టాలిటీ రేటు ఐదు, ఆరుగా నమోదవుతుంది. పాజిటివ్ కేసులు తగ్గుతున్నా మోర్టాలిటీ ఎందుకు తగ్గడం లేదు?

జవాబు : పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టినా కూడా వైరల్ స్ట్రైన్ అనేది రోజు రోజుకు మ్యూటేషన్స్‌ జరుగుతుంటుంది. ఇప్పుడు మోర్టాలిటీ కొంత ఎక్కువగా ఉంది. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటికి వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలి. చేతులు శానిటైజ్ చేసుకోవాలి. మాస్క్‌ ధరించడంతో టీబీ కేసులు కూడా తగ్గాయి.

ప్రశ్న: ఫ్లాస్మా థెరపి కర్నూలు వైద్యకళాశాల పరిధిలో ఎలా జరుగుతోంది?

జవాబు : ఇప్పటి వరకు 123 మంది నుంచి ఫ్లాస్మా తీసి... 93 మంది రోగులకు ఇవ్వడం జరిగింది. రికవరీ శాతం 80-90 శాతం ఉంది. మోడ్రేట్ సింప్‌టమ్స్ ఉన్న రోగులకు ఇవ్వడం వల్ల రికవరీ అవకాశం ఎక్కువ ఉంటుంది.

ప్రశ్న: వాతావరణంలో మార్పుల వల్ల వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా?

జవాబు: వాతావరణానికి సంబంధం లేదు. వైరస్ ఎండాకాలంలో రావడం జరిగింది. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్వరం, జలుబు వస్తే కొవిడ్ పరీక్షలు చేసుకోమంటున్నాం. రోగ నిర్ధారణలో మనం ముందున్నాం. ప్రతి జిల్లాల్లో పరీక్షలు చేయడం వల్ల త్వరగా గుర్తించడం జరిగింది. ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేస్తుంది. లక్షణాలు ఉంటే ప్రజలు అప్రమత్తంగా ఉండి పరీక్షలు చేసుకుంటే కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.