ETV Bharat / state

కర్నూలులో ఉరివేసుకున్న కేరళవాసి - మలబార్​ గోల్డ్ ఉద్యోగి అత్మహత్య

అతడు పనిచేసే సంస్థలోనే నగదు మాయం చేసిన కేసులో నిందితుడు... తప్పు చేశానని అంగీకరించాడో... శిక్ష పడుతుందని భయపడ్డాడో... ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి తనకు తానే శిక్ష వేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలులో జరిగింది.

kerala person suicide in kurnool
కేరళ వ్యక్తి కర్నూలులో ఆత్మహత్య
author img

By

Published : Jul 8, 2020, 9:51 AM IST

కర్నూలు నగరంలో మలబార్​ గోల్డ్​లో పనిచేసే జిజో మ్యాథూస్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాకు చెందిన మ్యాథూస్ మలబార్​ గోల్డ్ షాప్​లో అకౌంటెంట్​గా పని చేసేవాడు. ఇటీవల సంస్థ ఖాతా నుంచి 12 లక్ష రూపాయలు మ్యాథూస్​తో పాటు మరికొందరు ఖాతాల్లోకి మళ్లినట్లు యాజమాన్యం గుర్తించింది. ఈ ఘటనపై కేరళ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. దీంతో మ్యాథూస్ కర్నూలు నగరంలో తను ఉంటున్న అపార్ట్​మెంట్​లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.