కర్నూలు జిల్లాలో జరిగే తుంగభద్ర పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలోని పలు ఘాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈనెల 20 నుంచి జరిగే పుష్కరాలకు 21 పుష్కర ఘాట్లు సహా భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. నాగలదిన్నె, గురజాల గ్రామాల్లో పుష్కర పనితీరుపై పర్యటించారు. నాగలదిన్నె పుష్కర ఘాట్ పనులపై కలెక్టర్ వీరపాండియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు అరకొరగా చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గురజాల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని, పనులను పరిశీలించారు.
కొవిడ్ కారణంగా పుణ్యస్నానాలు నిషేధించినందున.. భక్తులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. త్వరలోనే వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచుతామని.. పుష్కరాలకు వచ్చే భక్తులు ఈ- టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: