ETV Bharat / state

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా... డబ్బుతో ఉడాయించిన ముఠా - online cheatings in kurnool

నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల పేరిట బురిడీ కొట్టిస్తున్నారు. అసత్యాలు నమ్మి, అనామకులకు డబ్బు ధారపోయకూడదని అధికారులు చెబుతున్నా..నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో పలువురు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

jobless people cheated by someone
మోసపోయామని ఆధారాలు చూపిస్తున్న నిరుద్యోగులు
author img

By

Published : Oct 15, 2020, 1:56 PM IST

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని ముఖం చాటేసిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఏం జరిగిందంటే:

ఉలిందకొండ, ప్యాపిలి, పెరవలి గ్రామాలకు చెందిన ఐదుగురు నిరుద్యోగులకు ఓ ముఠా ఎర వేసింది. ఎంబీఏ, డిగ్రీ చదవిన శరత్‌బాబు, వినోద్‌కుమార్, నాగన్న, ప్రసన్న, బీఈడీ చేసిన సుధాకర్ ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. తొలుత నాగన్నకు అందిన విజటింగ్ కార్డులోని చరవాణి నెంబర్‌కు సంప్రదించగా నవీన్‌కుమార్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని, తన సొంత ఊరు నందికొట్కూరు అని తెలిపారు. వాట్సప్‌ ఐడీ చిత్రం ఓ రాజకీయ నేతది పెట్టుకున్నారు. దీంతో అతని మాటలు నమ్మి ఉద్యోగంపై ఆశలు పెట్టుకున్నారు.

బంగారంపై రుణం అందించే ఓ ప్రైవేటుకంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. పీజీ చదివిన వారికి క్యాషియర్ పోస్టుకు 25 వేల రూపాయల జీతం, డిగ్రీ చదివిన వారికి గోల్డ్ అనలిస్టు పోస్టుకు 19 వేల రూపాయల జీతం ఇస్తామని నమ్మబలికారు. ఇంటర్వ్యూలు ఎప్పుడనేది హైదరాబాద్‌ నుంచి రాజు అనే వ్యక్తి ఫోన్ చేస్తాడని చెప్పారు. అదే విధంగా ఫోన్‌ కాల్ రావడంతో ఉద్యోగాలు నిజమేనని నమ్మిన నిరుద్యోగులు వేరువేరుగా నగదు బదిలీ చేశారు.

జనార్ధన్‌ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని, ఇంటర్వ్యూలో అతనే కీలకమని చెప్పడంతో బాధితులు ఒక్కొక్కరు రూ.12,500 ఫోన్‌పే ద్వారా బదిలీ చేశారు. సెప్టెంబర్ పది నుంచి నవీన్‌కుమార్, రాజు చరవాణులు స్విచ్ఛాఫ్​కావడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు.

పోలీసులకు ఫిర్యాదు:

నవీన్​కుమార్​ చెప్పిన సంస్థ నందికొట్కూరు బ్రాంచ్​కు వెళ్లి అతనిపై ఆరా తీయగా తమలాగే మరికొంత మంది మోసపోయారని తెలిసింది. కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల వారంతా జనార్థన్​ ఖాతాకే నగదు బదిలీ చేసినట్లు బాధితులు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఎస్పీ కార్యాలయంలో అర్జీ అందచేశారు. తమలాగే ఇంకెవరూ మోసపోకూడదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అప్పులు తెచ్చి నగదు కట్టామని పోలీసులు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్​లైన్​ మోసం

ఇదీ చదవండి: లంక గ్రామాలకు ముంపు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.