కర్నూలులో జనసేన నాయకులు రెండవ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వేధిస్తున్నారని వారు వాపోయారు. ప్రీతిభాయ్ కేసులో జనసేన నాయకులు మద్దతుగా నిలిచినందుకే.. తమ ఇళ్ల వద్దకు పోలీసులు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ఇళ్ల వద్దకు పోలీసులు రావడం ఏంటని వారు ప్రశ్నించారు. ట్విట్టర్లో ప్రీతిభాయ్కి న్యాయం జరగాలని కోరినందుకు పోలీసులు వేధిస్తున్నారన్నారు.
ఇదీ చూడండి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే 3 రాజధానులు: దేవినేని