ETV Bharat / state

'విస్తృత పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యం' - కర్నూలు జిల్లా కరోనా తాజా అప్ డేట్స్

కర్నూలు జిల్లాలో కరోనా కేసులను త్వరగా గుర్తించడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తున్నామని... జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు తెలిపారు. ఇప్పటికే 5 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. గతంతో పోలిస్తే మౌలిక వసతులు బాగా మెరుగుపడ్డాయని, ప్రస్తుతం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా సంజీవని బస్సుల ద్వారా పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రెండోసారి కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని... వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే రెండోసారి వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్న డాక్టర్ మోక్షేశ్వరుడుతో ఈటీవీ భారత్ ముఖాముఖి

interview-with-kurnool-district-covid-testing-incharge-doctor-moksheswarudu
డాక్టర్ మోక్షేశ్వరుడు
author img

By

Published : Sep 17, 2020, 3:42 PM IST

Updated : Sep 17, 2020, 6:26 PM IST

ప్రశ్న : ఈ మధ్య కాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ కేసుల సంఖ్య ఇలానే తగ్గుతుందా లేదంటే పెరిగే అవకాశం ఉందా?

జవాబు: ఎపిడమిక్, ప్యాండమిక్ పరిస్థితుల్లో సోర్స్‌ను గుర్తించడం, ఐసోలేట్ చేయడం ముఖ్యమైన పని. ఈ యాక్టివిటీ ఎక్కువగా చేశాం. అన్ని రకాల పరీక్షలు చేశాం. పరీక్షల్లో కర్నూలు జిల్లాలో 5 లక్షల మార్కులను దాటేశాం. అనుమానితులను త్వరగా గుర్తించి ఐసోలేట్ చేయటంతో కేసుల సంఖ్య తగ్గింది. దీన్ని ఇలానే కొనసాగిస్తే కొవిడ్‌ నుంచి జిల్లా విముక్తి పొందేందుకు అవకాశముంది.

ప్రశ్న : పరీక్షలకు సంబంధించి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ పెరిగింది. గతంలో ఎన్ని పరీక్షలు చేశారు. ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు?

జవాబు: మొదట్లో పరీక్షలు చేయడానికి చాలా సమస్యలు ఉండేవి. జీరో లెవెల్ నుంచి రోజుకు 6,500 పరీక్షలు చేసే సామర్థ్యం వచ్చింది. ఏప్రిల్‌లో ప్యాండమిక్ మొదలైనప్పుడు పరీక్షల కోసం తిరుపతి, అనంతపురానికి పంపాము. ఆ తరువాత కర్నూలులో ఒక ల్యాబ్ పెట్టుకున్నాం. క్రమంగా జిల్లాలో ల్యాబ్‌ల సంఖ్య పెంచాం. ర్యాపిడ్ యాంటీజన్ కిట్లు వచ్చాక పరీక్షలు చేయడం సులభమైంది. అన్ని ఆసుపత్రుల్లో, పీహెచ్‌సీల్లో, సంజీవిని బస్సుల్లో రోగులకు అందుబాటులో పరీక్షలు చేస్తున్నాం. పరీక్షల కోసం సిబ్బంది అందరూ శిక్షణ తీసుకున్నారు. ప్రభుత్వం అన్ని రకాల కిట్లను అందుబాటులో ఉంచడంతో పరీక్షలు పూర్తి స్థాయిలో చేస్తున్నాం.

ప్రశ్న : ఏ ప్రాంతాల్లో కేసులు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి?

జవాబు: ప్రారంభంలో పట్టణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా వచ్చాయి. కర్నూలు, ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా వచ్చాయి. ప్రజలకు వ్యాధి నిరోధక శక్తి పెరగటంతో ఇక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పనుల కోసం పట్టణాలకు వచ్చిన గ్రామీణుల ద్వారా కరోనా గ్రామాల్లో వ్యాపించింది. కొన్ని ప్రాంతాల్లో తప్పితే మిగత ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది.

ప్రశ్న : ప్రజల్లో అవగాహన పెరగటం వల్ల కేసులు తగ్గాయా? లేదంటే హోం ఐసోలేషన్ తీసివేయడం వల్ల తగ్గాయా?

జవాబు: ప్రజలకు అవగాహన వచ్చింది. అయినా జాగ్రత్తలు పాటించడం లేదు. నిర్లక్ష్యం అనేది ఇంకా ఉంది. మరణాల శాతం తక్కువగా ఉంది. ఎక్కువ మంది భయపడటం లేదు. కేసును గుర్తించిన వెంటనే రోగిని ఐసోలేట్ చేస్తున్నాం. మొదట్లో హోం ఐసోలేషన్‌ ఉన్న వారివల్ల కుటుంబ సభ్యులకు వ్యాధి సోకింది. దీంతో తరువాత అందరిని కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించాం. జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్లలో 6 వేల దాకా పడకలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 5 వేల బెడ్లు ఉన్నాయి.

ప్రశ్న: ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందా ?

జవాబు: ఈ వైరస్‌కు అన్నింటినీ తట్టుకునే సామర్థ్యం ఉంది. మార్పు ఊహించలేం. వైరస్ అలాగే ఉనికిలో ఉంటుంది.

ప్రశ్న: ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీని వల్ల వైరస్ విస్తరించే అవకాశముందా ?

జవాబు: లాక్ డౌన్ అనేది పూర్తిగా ఎత్తివేయలేదు. రాబోయే పండుగ సమయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలలు తెరిచేలోపు టీచర్లను, అంగన్ వాడీ వర్కర్లను, ఆయాలు, మధ్యాహ్న భోజనం తయారు చేసేవారిని, వార్డెన్లను స్క్రీన్ చేస్తే రాబోయే కాలంలో కరోనా వ్యాప్తిని ఆపగలం.

ప్రశ్న: రెండోసారి కరోనా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది?

జవాబు: మనకు ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా శరీరంలో యాంటి బాడీలు తయారవుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు రెండో సారి వైరస్ దాడి చేస్తే లక్షణాలు కనబడవు. వైరస్‌ను చంపే శక్తి మన తెల్ల రక్తకణాలకు ఉంటుంది. కొంత మదిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి యాంటి బాడీలు తయారుకాకుంటే రెండోసారి వైరస్ రావడానికి అవకాశం ఉంది. వైరస్‌ సంఖ్య శరీరంలో ఎక్కువగా ఉన్నప్పుడు 14 రోజుల తరువాత పాజిటివ్ వచ్చినా కూడా డెడ్ వైరస్ ఉంటుంది. దీని వల్ల కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనే ఈ ప్రమాదం ఎక్కువ. 95 శాతం మరలా రాదు.

ప్రశ్న: కొవిడ్ గురించి ప్రజలకు ఏం చెబుతారు ?

జవాబు: ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటిస్తే అన్ని అంటువ్యాధులను నిర్మూలించవచ్చు. కరోనానే కాదు గాలి ద్వారా వ్యాపించే ఇతర వ్యాధులు ఉన్నాయి. ప్రస్తుతం టీబీ కేసుల సంఖ్య తగ్గుతోంది. అయినా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇవీ చదవండి...

'కరోనా కారణంగా కష్టపడ్డాం.. త్వరలోనే బయటపడతాం'

Last Updated : Sep 17, 2020, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.