కర్నూలు సమీపంలోని తెలంగాణ రాష్ట్ర సరిహద్దు టోల్ గేట్ వద్ద ఆ రాష్ట్ర అధికారులు వాహనలు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి పదిగంటల వరకే వాహనల రాకపోకలకు అనుమతి ఉంటుందని పది గంటల తర్వాత అనుమతి ఉండదని.. ఇందుకు ప్రజలు సహకరించాలని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిత్యవసర సరకుల రవాణా, మెడికల్ అత్యవసర పనుల నిమిత్తం వెళ్తున్న వాహనాలు మినహా ఇతర వాహనాలు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందులకు గురికాకుడదని అధికారులు వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి:
కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్