ETV Bharat / state

శ్మశానంలో పూలు పూయించారు.. నవనిర్మాణ సమితి ఘనత - నంద్యాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

శ్మశానం పేరు చెబితేనే జనాల వెన్నులో వణుకు మొదలవుతుంది..! కానీ, ఈ శ్మశానానికి వెళ్తే ఆహ్లాద కరమైన వాతావరణం కనిపిస్తుంది. మరి, ఈ రుద్రభూమి ప్రత్యేకత ఏంటీ? అది ఎక్కడ ఉంది? అన్నది చూద్దాం..

వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తున్న దృశ్యం
వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తున్న దృశ్యం
author img

By

Published : Nov 1, 2021, 7:29 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలోని స్వర్గధామంలో.. నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా.. భీమవరం రస్తాలోని పీవీనగర్‍లో ఉన్న హిందూ శ్మశాన వాటికలో పూల మొక్కలు నాటారు. ఇటీవల ఏర్పాటు చేసిన శుద్ధమైన మినరల్‍ వాటర్‍ ప్లాంట్‍ సైతం ప్రారంభించారు. తద్వారా పట్టణ ప్రజలకు ఉచితంగా స్వచ్ఛమైన నీటి సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గతంలో నాటిన మొక్కలకు బిందుసేద్య విధానంలో నీటి వసతి కూడా కల్పించారు. నంద్యాల నవనిర్మాణసమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో.. ఛైర్‍పర్సన్‍ మాబున్నీసా, వైస్‍ ఛైర్మన్‍ గంగిశెట్టి శ్రీధర్‍ పాల్గొన్నారు. అపరిశుభ్రతకు ఆలవాలంగా కనిపించే శ్మశాన వాటికలో.. మార్పు తెచ్చేందుకే తాము ఈ కృషి చేస్తున్నామని నవనిర్మాణ సమితి ఉపాధ్యక్షుడు డాక్టర్‍ మధుసూదన్‍రావు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.