ETV Bharat / state

ఆదోని నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తెలుగమ్మాయి - T20 series against Australia news

T20 series against Australia: డిసెంబర్‌ 9 నుంచి 20 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు.. భారత తరపున మహిళా క్రికెట్‌ జట్టుకు కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన యువ క్రీడాకారిణి అంజలి శర్వాణి ఎంపికైంది. టీమ్‌ ఇండియాకు అంజలి శర్వాణి ఎంపిక పట్ల ఆదోని ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అంజలి శర్వాణి
Anjali Sarvani
author img

By

Published : Dec 2, 2022, 3:51 PM IST

Anjali Sarvani: ఏపీకి చెందిన యువ క్రీడాకారిణి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆ జట్టులో కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అంజలి శర్వాణి ఎంపికైంది. డిసెంబర్‌ 9 నుంచి 20 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు జట్టులో స్థానం సంపాదించుకుంది.

టీమ్‌ ఇండియాకు అంజలి శర్వాణి ఎంపిక పట్ల ఆదోని ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కుటుంబసభ్యులకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా.. తల్లి గృహిణి. స్థానిక మిల్టన్‌ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు.. ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో క్రికెట్‌ వైపు అడుగులు వేసిన అంజలి.. అంచలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.